మోసగాడు మోదీ.. అంబానీ సుట్టమే ! - MicTv.in - Telugu News
mictv telugu

మోసగాడు మోదీ.. అంబానీ సుట్టమే !

February 16, 2018

విజయ్ మాల్యా తర్వాత  బ్యాంకులను ముంచుట్ల మరో తోపు తయారైండు అని రెండు మూడు రోజుల నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి కదా. అతనే వజ్రాల వ్యాపారి  నీరవ్ మోదీ.

పంజాబ్ నేషనల్ బ్యాంకుకు పంగనామం పెట్టి రూ.11400 కోట్ల రూపాయలను మింగి…నాకేం సంబంధంలేదన్నట్లు  విదేశాలకు చెక్కేశాడు. అయితే  అతడు చేసిన మోసానికి  ఈడీ సమన్లు జారీ అయ్యాయి.  ఇప్పుడు ఆయనకు సంబంధించి ఇంకో ఆసక్తి కరమైన విషయం బయటపడింది.

ప్రముఖ వ్యాపార వేత్త ముఖేష్ అంబానీకి  నీరవ్ మోదీ దగ్గరి  సుట్టం. అంబానీ మేనకోడలు నీరవ్ మోదీ తమ్ముడు నిరాష్ మోదీని పెళ్లి చేసుకుంది.  ఇషితా, నిరాష్ ఇద్దరు  లవ్ చేసుకుని  పెద్దలను ఒప్పించి  పెళ్లి చేసుకున్నారు. బ్యాంకులను ముంచిన  ఘనుడికి అంబానికి సుట్టరికం అవుతాడనే వార్త  సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.  అంబానీకి  వ్యాపారవేత్తగా మంచి పేరుంది.  

మరి ఇలా బ్యాంకులను ముంచి  అంబానీకీ  కూడా నీరవ్ మోదీ చెడ్డపేరు తెచ్చాడు.. అని నెటిజన్లు  కామెంట్లు పెడుతున్నారు.  అయినా  కొడుకుల్ని కంటాం కానీ వాళ్ల రాతల్ని కంటామా అన్నట్లు  ఎంత  సుట్టరికం అయితే మాత్రం ..ఆయన చేసిన తప్పుకు అంబానీ ఏం చేస్తాడు అని  మరికొందరు అంటున్నారు.