సినిమా ప్రేమికులను అలరిస్తున్న పాట ! - MicTv.in - Telugu News
mictv telugu

సినిమా ప్రేమికులను అలరిస్తున్న పాట !

February 5, 2018

‘కృష్ణానగరే మామా, కృష్ణా నగరే మామా’ అని  ఓ సినిమాలోని  పాటలో సినిమావాళ్ల కష్టాలేంటో పాట పాడుతూ చెబుతాడు హీరో. నిజమే ‘వెండితెర’అనే రంగుల ప్రపంచంలోకి ఎన్నో ఆశలతో.. ఎన్నో ఆశయాలతో  పుట్టిన ఊరిని, కన్న వారిని వదిలి…‘సినిమా’ అనే పుస్తకంలో తమకంటూ కొన్ని పేజీలు రాసుకోవాలని పట్నంలో అడుగుపెడతారు. తీరా అక్కడికి వెళ్లాక తెలుస్తుంది. మనం ఒక్కరే కాదు మనలాంటి సినిమా పిచ్చోళ్లు వేలల్లో,లక్షల్లో ఉన్నారని. అయినా సినిమాపై మనసు చావక ఎన్ని కష్టాలు అయినా పడి..ఒక్క చాన్స్ అంటూ చెప్పులరిగేలా తిరిగి తమ కలను నిజం చేసుకోవాలని ప్రయత్నిస్తుంటారు. షూటింగ్ ఉన్నప్పుడు మస్తు, లేకపోతే పస్తు అన్నట్టుగా సాగుతాయి వాళ్ల జీవితాలు.  

ఆ సినిమా పిచ్చోళ్ల  నిజ జీవితాలను కళ్లకు కట్టినట్టు చూపించే ప్రయత్నం చేస్తోంది మీ మైక్ టీవీ. ‘నిరుద్యోగ నటులు’ అంటూ  ఓ వెబ్ సిరిస్‌తో మీముందుకు వస్తున్నాం. ఇప్పటికే దానికి సంబంధించిన ట్రైలర్, టైటిల్ సాంగ్ కూడా రిలీజ్ చేశాం. బాటపొంటి పోయే పోరగాడ జర సర్ధుకో అంటూ సాగే  ఈటైటిల్ సాంగ్‌లో వెండితెర రారాజు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ గ్రహీత పైడిజయరాజ్ గురించి, కోరికోరి ఎంచుకున్న జిందజీ రా,అచ్చ బూర అయినా తప్పదే అని  సినిమావాళ్లకు, సినిమాను ప్రేమించే వాళ్లకు  ఇన్పైరింగ్ గా ఉంది ఈపాట. త్వరలో ఈవెబ్ సిరీస్‌లోని మొదటి భాగాన్ని మీముందుకు తీసుకొస్తం.