విదేశీయుణ్ని చితగ్గొట్టిన నిజామాబాద్ రైతులు.. - MicTv.in - Telugu News
mictv telugu

విదేశీయుణ్ని చితగ్గొట్టిన నిజామాబాద్ రైతులు..

April 9, 2018

కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు  ఆ ప్రాంతం గురించి, ఆ ప్రాంతంలో మాట్లాడే భాష గురించి తెలుసుకుని మరీ వెళ్లాలి. లేకపోతే భాషతో చెప్పరాని కష్టాలు ఎదురువుతాయి. అలాంటి సంఘటనే ఓ వ్యక్తికి ఎదురైంది.  అర్థంకాని భాష మాట్లాడడంతో దొంగ అనుకుని రైతులు అతన్ని చితక్కొట్టారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా బిక్నూర్‌లో చోటు చేసుకుంది.

రష్యాకు చెందిన వీవోలెజ్ అనే యువకుడు సైకిల్‌పై ప్రపంచ యాత్రకు వచ్చాడు. నిజామాబాద్ నుంచి షిర్డీకి బయల్దేరాడు. బిక్నూర్ రాగానే గాలివాన రావడంతో సమీపంలోని పోలం దగ్గర ఆగి, టెంట్ వేసుకునే ప్రయత్నం చేశాడు. తలకు లైటు కట్టు కట్టుకున్నాడు. ఇంతలో పొలం యాజమాని అక్కడికి  వచ్చాడు. టెంట్ ఎందుకు వేశావని విదేశీయుడిని ప్రశ్నించాడు. మరికొందరు రైతులు మూగారు. వీవోలెజ్ భాష అర్థంకాకపోవడం, అతడు అర్ధనగ్నంగా ఉండడంతో రైతులు అతణ్ని దొంగ అనుకున్నారు. గట్టిగా నిలదీయడంతో అతడు భయపడి పారిపోయే ప్రయత్నం చేశారు. రైతులు అతణ్ని పట్టుకుని తీవ్రంగా కొట్టారు. వీవోలెజ్‌కు తీవ్ర గాయాలయ్యాయి.

పోలీసులు  సంఘటన స్థలాన్నికి చేరుకుని వీవోలెజ్‌ను కామారెడ్డిలోని ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ ఉస్మానియా హాస్పిటల్‌కు తీసుకొచ్చారు. వోలెజ్ తల, భుజం, ఛాతికి తీవ్ర గాయాలయ్యాయి. రైతులు మాట్లాడిన భాష తనకు అర్థం కాలేదని, గూగుల్ ట్రాన్స్‌లేటర్ సాయం తీసుకొందామనే లోపు దాడి చేశారని బాధితుడు తెలిపాడు.