గల్ఫ్‌లో నిజామాబాద్ వాసి ఆత్మహత్య

పొట్ట కూటి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన మరో గుండె ఆగిపోయింది. వ్యవసాయం గిట్టుబాటు కాకపోవడంతో అప్పుల పాలైన ఓ యువ రైతు ఉపాధి కోసం బహ్రెయిన్‌ దేశం వెళ్ళాడు. అక్కడ కూడా వేతనం తక్కువ ఉందని,తన కష్టాలు ఇక తీరవనే  మానసిక ఆందోళనతో గదిలోనే ఉరి వేసుకొని మృతిచెందాడు.

Telugu News nizamabad resident died in bahrain country due to less salary.

మృతుని కుటుంబ సభ్యుల, స్థానికుల కథనం ప్రకారం… నిజామాబాద్‌ జిల్లా ఇందల్వాయి మండలం కొత్తకోరుట్ల గ్రామానికి చెందిన బాదావత్‌ గణేశ్‌(25) వ్యవసాయం గిట్టుబాటు కాకపోవడంతో సంపాదన కోసం డిసెంబర్‌లో బహ్రెయిన్‌ దేశానికి వెళ్లాడు. అక్కడ జీతం తక్కవగా ఉందని… అప్పులు తీర్చే మార్గం లేదని రోజు బాధ పడుతుండేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు. మంగళవారం ఆరోగ్యం బాలేదని పనికి రాలేనని తన సహచరులకు చెప్పాడు. ఈ క్రమంలో తన సహచరులు పని ముగించుకుని తిరిగి వచ్చే సరికి గణేశ్‌ గదిలో ఉరి వేసుకొని విగతజీవిలా పడివున్నాడు. దీంతో వారు కుటుంబసభ్యులకు తెలియజేయడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మృతుని భార్య గర్భవతి. వీరికి ఒక కుమార్తె కూడా ఉంది. మృతదేహాన్ని స్వదేశానికి రప్పించే ఏర్పాట్లు చేయాలని కుటుంబసభ్యులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Telugu News nizamabad resident died in bahrain country due to less salary