ఆధార్ లేదని నిండు గర్భిణిని వెళ్లగొట్టారు! - MicTv.in - Telugu News
mictv telugu

ఆధార్ లేదని నిండు గర్భిణిని వెళ్లగొట్టారు!

February 10, 2018

అన్నింటికీ ఆధార్ అని ఊరికే అన్నారా?  గుర్గావ్‌లోని  ఓ ఆసుపత్రి సిబ్బంది కూడా అదే ఫాలో అయ్యారు. ఆధార్ కార్డ్ లేదని మహిళను ఆసుపత్రి గేటు కూడా దాటనివ్వలేదు. ప్లీజ్ మేడం అమ్మాయికి నొప్పులు ఎక్కువయ్యాయని ఎంత మొత్తుకున్నా కూడా..ఆధార్ ఉంటేనే ఆసుపత్రిలోకి ఎంట్రీ అని ఖరాకండిగా చెప్పేశారు. పాపం ఆ గర్భిణికి నొప్పులు ఎక్కువవడంతో ఆసుపత్రి గేటు దగ్గరే ప్రసవించింది. గుర్గావ్ కు చెందిన మున్ని కేవాత్ (25) అనే గర్భిణి పురిటి నొప్పులతో బాధపడుతుంటే భర్త ఓ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చాడు. అయితే భార్యకు పురిటి నొప్పులు వచ్చాయనే కంగారులో ఆధార్ తేవడం మర్చిపోయాడు.ప్లీజ్ మేడం ఆధార్ తర్వాత తెస్తాను..ఆడబిడ్డ నొప్పులతో బాధపడుతోంది అని డాక్టర్ నర్సులతో ఎంత మొత్తుకున్నా కూడా..ఆధార్ ఉంటేనే చూస్తాం అని చెప్పేశారు. దానితో గేటువద్దే ఆమహిళ ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈతతంగాన్ని చూసిన వారందరూ వీడియో తీస్తూ…ఇంత కఠినంగా మారిన ప్రభుత్వ ఆసుపత్రులంటూ సోషల్ మీడియాలో పెట్టారు. దానితో ఈవిషయం పై అధికారల దాకా వెళ్లడంతో ఈ ఘటనకు కారణమైన మహిళా డాక్టర్, నర్సులను ఆస్పత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్ సస్పెండ్ చేశారు.