తక్కువ డేటాతో ‘య్యూట్యూబ్’ లో వీడియోలు చూడొచ్చు - MicTv.in - Telugu News
mictv telugu

తక్కువ డేటాతో ‘య్యూట్యూబ్’ లో వీడియోలు చూడొచ్చు

November 28, 2017

య్యూట్యూబ్‌లో వీడియోలు చూస్తే ఎక్కువ డేటా ఖర్చవుతుందనేది మనకు తెలిసిందే. అయితే తక్కువ డేటా ఉన్నప్పుడు య్యూట్యూబ్ వీడియోలు సరిగ్గా రావు, ఎక్కువగా బఫరింగ్ అవుతూ ఉంటాయి. అయితే ఈసమస్యను పరిష్కరించడానికి వచ్చిందే ‘య్యూట్యూబ్ గో’ యాప్.

అయితే ఇప్పటివరకు ఈయాప్ బీటా వెర్షన్ మాత్రమే.. మనదేశంలో అందుబాటులో ఉంది. అయితే ఇప్పుడు ఆ బీటా వెర్షన్‌ను తీసేసి అధికారిక వెర్షన్ అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతానికి ఐఓఎస్  ఫోన్లకు ఈయాప్ అందుబాటులోకి రాలేదు. త్వరలోనే అందరూ దీన్ని ఉపయోగించే విధంగా రూపొందనుంది.ఈ ‘యూట్యూబ్ గో’ యాప్ ద్వారా డేటా సేవ్ చేసుకోవ‌చ్చు, డేటా అవ‌స‌రం లేకుండానే వీడియోల‌ను షేర్ చేసుకోవ‌చ్చు.

అంతేకాకుండా ఏ వీడియోకు ఎంత డేటా అవ‌స‌ర‌మో కూడా ఈ యాప్ ద్వారా తెలుసుకోవ‌చ్చు. ఈయాప్ మెమెరీ కూడా చాలా తక్కువగా ఉంటుందని యాప్ రూపకర్తలు చెబుతున్నారు.