ఆలూ లేదూ  చూలూ లేదు.. కానీ 17 మందిని కనేశాడు.. - MicTv.in - Telugu News
mictv telugu

ఆలూ లేదూ  చూలూ లేదు.. కానీ 17 మందిని కనేశాడు..

February 21, 2018

ఈ రోజుల్లో పిల్లలను కనటం కొందరికి చాలా సులభం అయిపోయింది అనటానికి ఈ ఉదంతమే ఉదాహరణ. జపాన్‌కు చెందిన 28 ఏళ్ళ మిషుటోపి షిగెటా పెళ్లి చేరసుకోకుండానే 17 మంది పిల్లలకు తండ్రి అయ్యాడు. సంపన్నుడైన షిగెటా థాయ్ మహిళలతో సరోగసీ పద్ధతిలో చేయించి 13 మంది పిల్లలను కన్నాడు. గత నాలుగేళ్లుగా ఈ కేసులో విచారణ జరుగుతున్నది. చివరకు మంగళవారం థాయ్ ఫ్యామిలీ కోర్టు ఈ కేసులో తుది తీర్పును వెలువరించింది. సరోగసీ పద్దతిలో పుట్టిన ఆ 13 మంది పిల్లల కస్టడీని షిగెటాకు కోర్టు అప్పగించింది.షిగెటా గుర్తు తెలియని మహిళల అండాలు సేకరించి తన వీర్యంతో థాయ్ మహిళల వద్ద సరోగసీ చేయించాడు. తన పిల్లల కోసం పోరాడిన షిగెటా ప్రయత్నం చివరికి సఫలం అయింది. కేసు గెలవడంతో ఆ పిల్లలను జపాన్‌కు పంపేందుకు థాయ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. కాగా షిగెటా సరోగసీ పద్ధతిలో 17 మంది పిల్లలను కన్నాడు. ఆ నలుగురిలో ఇద్దరు భారత్‌లో సరోగసీ ద్వారా జన్మించారని షిగెటా లాయర్ తరుపు న్యాయవాది తెలిపారు. తన వద్ద ఇప్పుడు నలుగురు చిన్నారులు వున్నారు. అయితే వాళ్ళు కోర్ట్ కేసులో లేకపోవడం గమనార్హం.