అంబులెన్స్ లేదన్నారు..తోపుడు బండిపై భార్య శవాన్ని ! - MicTv.in - Telugu News
mictv telugu

అంబులెన్స్ లేదన్నారు..తోపుడు బండిపై భార్య శవాన్ని !

March 14, 2018

ఎంత టెక్నాలజీ పెరిగితే ఏమిటి, ఎన్ని సౌకర్యాలు వస్తే ఏంది. పేదవాడి దరికి చేరని ఆ సౌకర్యాలు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. ఈరోజుల్లో డబ్బుకు, వస్తువులకు ఇచ్చే విలువలో 10 శాతం మనుషులకు ఇస్తే ఇలాంటి సంఘటనలు పునరావృతం కావు.  కన్హయ్య అనే వ్యక్తి తన భార్యకు నొప్పి రావడంతో అంబులెన్స్‌కు ఫోన్ చేశాడు.

కానీ గంటలు గడిచినా అంబులెన్స్ రాలేదు. దీనితో తోపుడు బండిపై భార్యను ఆసుపత్రికి తీసుకెళ్లారు..కానీ అప్పటికే జరగాల్సి ఘోరం జరిగిపోయింది. ఆలస్యం కావడంతో డాక్టర్లు ఆమె చనిపోయిందని చెప్పారు. అయ్యో అంబులెన్స్ టైంకి వచ్చుంటే నాభార్య బ్రతికేదే అని కన్నీళ్లు పెట్టుకకున్నాడు ఆ భర్త. ఆ తర్వాత మృతదేహాన్ని తీసుకువెళ్దామన్నా ఆసుపత్రి వాళ్లు అంబులెన్స్ ను ఇవ్వలేదు. దీనితో భార్య శవాన్ని దుప్పట్లో చుట్టి అదే తోపుడు బండిపై తీసుకెళ్లాడు. ఉత్తరప్రదేశ్ లోని మొయిన్ పురి జిల్లాలో జరిగింది ఈ ఘటన.

ఒక కూలీగా పుట్టడమే అతను చేసిన తప్పా? మోసాలు, నేరాలు నేర్చుకోకపోవడమే అతను చేసిన పాపమా? గుప్పెడు మెతుకులు దొంగతనం చేశాడని పిచ్చోడిని సైతం కొట్టి చంపే మనకు ఈ ఘటనలు ఒ లెక్కా… నిజంగా మనుషుల్లో జరుగుతున్న కరడు కట్టిన అభివృద్దిని మెచ్చుకోవాల్సిందే.