ఫ్రీ ఫోటోలకు నో అంటున్న గూగుల్ - MicTv.in - Telugu News
mictv telugu

ఫ్రీ ఫోటోలకు నో అంటున్న గూగుల్

February 16, 2018

గూగుల్ తల్లికి ఇంటర్నెట్ యూజర్ల మీద కోపం వచ్చినట్టుంది. ఇక నుంచి నెటిజన్లు తమకు నచ్చిన ఫోటోలను ఇష్టమొచ్చినట్టు సేవ్ చేసుకోనీయకుండా ఆ వెసులుబాటును తీసి పారేసింది. తన సెర్చింజన్‌లో మర్పులు చేసుకుంది. తన ఫోటోలను ఫ్రీగా వాడేసుకుంటున్నారని గూగుల్ ‘ వ్యూ ఇమేజ్’ బటన్‌ను తొలగించింది. కాపీరైట్స్ కారణాన్ని లేవనెత్తి గూగుల్ నుంచి ఈ ఆప్షన్‌ను తొలగించేసింది.

ఇంతకు ముందు గూగుల్‌లో ఏదైనా ఫోటోలను ఓపెన్‌ చేసినప్పుడు పక్కన విజిట్‌, షేర్‌లతోపాటు వ్యూ ఇమేజ్‌ ఆప్షన్‌ కూడా కనిపించేది. దానిని క్లిక్‌ చేస్తే ఆ ఫోటో ఓపెన్‌ అయ్యి సేవ్‌ చేసుకునే సౌలభ్యం ఉండేది. ఇప్పుడు గూగుల్‌‌లో కేవలం విజిట్‌, షేర్‌లు మాత్రమే కనిపిస్తున్నాయి. దీని నుంచి విజిట్‌ పేజ్‌ బటన్‌ ద్వారా ఆధారిత వెబ్‌‌సైట్‌కు యూజర్‌ వెళ్తాడు. తద్వారా తమ ఆదాయం పెంచుకునేందుకు గూగుల్‌ ఈ మార్గాన్ని ఎంచుకున్నట్టు  తెలుస్తోంది.

నేటి నుంచి గూగుల్‌లో కొన్ని మార్పులు చేశాం. వ్యూ ఇమేజ్ బటన్‌ను తొలగించేశాం.  ఆధారిత వెబ్‌సైట్లకు, యూజర్లకు ఉపయోగకరంగా ఉండాలనే ఈ పని చేశాం. హై డెఫినెషన్‌ ఫోటోలు కావాలనుకుంటే తప్పనిసరిగా సంబంధిత వెబ్‌సైట్‌ను ఆశ్రయించాల్సిందే ’ అని ఓ ప్రకటనలో గూగుల్‌ పేర్కొంది. కాగా యూజర్లు మాత్రం అప్పుడే ప్రత్యామ్నాయ మార్గాల  అన్వేషణ పడ్డారు.