ప్రేమలో ఓడిపోయాను.. ఈ జన్మకు పెళ్లి చేసుకోను.. చార్మి - MicTv.in - Telugu News
mictv telugu

ప్రేమలో ఓడిపోయాను.. ఈ జన్మకు పెళ్లి చేసుకోను.. చార్మి

March 26, 2018

ఈ జన్మలో పెళ్లి అస్సలు చేసుకోనని కుండ బద్దలు కొట్టి చెప్పింది నటి ఛార్మి. తనకు ప్రేమా, పెళ్ళి మీద ఇంట్రస్ట్ లేనట్టు ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. ‘ ప్రేమ విఫలమైన నాకు ఈ ప్రేమా, పెళ్ళి మీద నమ్మకం లేదు. బతుకంతా అమ్మానాన్నలతో ఇలాగే వుండిపోవాలనుకుంటున్నాను. పెళ్లి అనేది నా జీవితంలో జరగని పని.సినీ ఇండస్ట్రీకి చెందిన ఓ వ్యక్తితో ప్రేమలో పడ్డాను కానీ, రెండు విషయాల వల్ల మా ప్రేమ విఫలమైంది. నేనతణ్ణి పెళ్లి చేసుకునుంటే ఆ రెండు విషయాల కారణంగా కచ్చితంగా విడాకులు తీసుకునే పరిస్థితి ఏర్పడేది. నా చెడ్డతనం అతని మంచితనానికి సూట్ అయ్యేది కాదు. మా అమ్మ చీటికి మాటికి నా దగ్గర పెళ్ళి ప్రస్తావన తెస్తుంది. రిలేషన్‌లో సరిగ్గా ఇమడలేని నేను పెళ్లికి అనర్హురాలినని తెగేసి చెప్పేశాను. నా దగ్గర టైం లేదు కాబట్టి నేను భర్తకు, ఇంటికి టైం కేటాయించలేను.. అందుకే ఈ జన్మకు పెళ్ళి వద్దని ఫిక్స్ అయ్యాను ’ అని చెప్పింది చార్మి.