జగన్ సీఎం అయ్యేదాకా లగ్గం జేస్కోను - MicTv.in - Telugu News
mictv telugu

జగన్ సీఎం అయ్యేదాకా లగ్గం జేస్కోను

November 27, 2017

వైసీపీ నేత జగన్ మోహన్ రెడ్డి అయ్యేదాకా పెండ్లి చేసుకోనని ఓ విద్యార్థి శబథం పట్టాడు. నెల్లూరు జిల్లా కల్లూరు గ్రామానికి చెందిన రవీంద్ర(27) పీజీ చదువుతున్నాడు. అయితే ఆదివారం అతనికి..బంధువుల అమ్మాయితో పెళ్లి చూపులు అయ్యాయి. ఈ సందర్భంగా  అతను జగన్ సీఎం అయ్యేదాకా పెళ్లి చేసుకోను అని బంధువులకు చెప్పాడు.

దీనికి ఓ కారణం ఉందట..‘డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఫీజు రీయంబర్స్‌మెంట్‌తో నేను పీజీ చేశాను, నెల్లూరు విక్రమసింహపురి వర్సిటీలో 2015లో ఎంకాం పూర్తి చేశాను.. కానీ మూడేళ్లుగా ఉన్న చంద్రబాబు ప్రభుత్వంలో ఉద్యోగం సంపాదించడం అందని ద్రాక్షలా మారింది, అందుకే జగన్ ముఖ్యమంత్రి అయ్యేదాకా నుదిటికి బాసింగం కట్టను’ అని రవీంద్ర వివరణ ఇచ్చాడు.

ఉద్యోగాలు రావాలంటే వైఎస్‌ జగన్‌ సీఎం కావాలని, అప్పుడే తాను పెళ్లి చేసుకుంటానని రవీంద్ర దేవుడి సాక్షిగా ప్రమాణం కూడా చేశాడు. దీనికి అతని బంధువులు కూడా సమ్మతి తెలిపారు.