మందు,మాంసం ముట్టని ఊరు...ఎందుకంటే? - MicTv.in - Telugu News
mictv telugu

మందు,మాంసం ముట్టని ఊరు…ఎందుకంటే?

February 8, 2018

ఆ ఊరిలో 190 కుటుంబాలు, గ్రామంలోని ఏ ఒక్క కుటుంబలోని వ్యక్తులు కూడా మద్యం ముట్టరు, మాంసం తినరు. ఏమిటీ నమ్మశక్యంగా లేదు కదా? కానీ ఇది నిజం. కర్నాటక దగ్గరలోని శ్రీమజ్జినపల్లి గ్రామంలో ప్రజలు కట్టుబాట్లతో బ్రతుకుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ ఆచారం ఇప్పటిది కాదు వారి పూర్వీకుల నుంచి పాటిస్తున్నారు ఆ గ్రామస్థులు.

ఇంతకీ  ఎందుకు ఈ కట్టుబాట్లు అంటే..ఆ ఊరివాళ్ల ఇష్ట దైవం పాలనాయక స్వామి. అందుకే ఒకవేళ మందు, మాంసం తింటే దేవుడు కోప్పడతాడని పూర్వీకుల నుంచి ఆ గ్రామంలోని ప్రజలు విశ్వసిస్తున్నారు. అదే కట్టుబాటును  ఇప్పటికీ ఆచరిస్తున్నారు. ఒకవేళ ఎవరైన మద్యం తాగి ఊరిలోకి వస్తే తాగిన వ్యక్తి నాలుకపై చిన్న వేప పుల్లతో వాత పెడతారు.

ఈ ఒక్కకట్టుబాటే కాదు మూడేళ్ల కొకసారి గ్రామస్థులందరూ కలిసి 24 గంటలు గ్రామాన్ని వదిలి ఊరు బయట వంటలు చేసుకుని అక్కడే ఉంటారు. ఆ ఒక్కరోజు మొత్తం గ్రామంలోకి ఎవ్వరూ రాకుండా చుట్టూ ముళ్ల కంచెలు వేస్తారు. ఇలా కఠిన కట్టుబాట్లను ఆచరిస్తున్నాం కాబట్టే గ్రామం అభివృద్ది చెందిందని , ఎవ్వరూ కూడా మద్యానికి బానిస కాలేదని  గ్రామస్థులు చెబుతున్నారు.