పాన్ కార్డులో తండ్రి పేరు లేకున్నా పర్వాలేదు… - MicTv.in - Telugu News
mictv telugu

పాన్ కార్డులో తండ్రి పేరు లేకున్నా పర్వాలేదు…

November 21, 2018

పాన్ కార్డులో తప్పనిసరిగా తండ్రి పేరును నమోదు చెయ్యాలన్న నిబంధన వుంది. ఇప్పుడా నిబంధనను కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సీబీడీటీ) సడలించింది. తల్లి మాత్రమే ఉండేవారికి ఈ సడలింపు వర్తిస్తుంది. తండ్రి మరణించినా, విడిచి వెళ్ళిపోయినా వారి పేరును దరఖాస్తులో నమోదు చెయ్యాల్సిన అవసరం లేదని పేర్కొంది.Telugu news No more mandatory quoting of father's name in PAN card applicationsఈ మేరకు నిబంధనలను సవరిస్తూ సీబీడీటీ మంగళవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వచ్చే నెల 5 నుంచి ఈ మార్పులు అమలులోకి వస్తాయని స్పష్టం చేసింది. ఇదిలావుండగా ఆర్థిక సంవత్సరంలో రూ.2.5 లక్షలకు మించి లావాదేవీలు జరిపే సంస్థలు తప్పనిసరిగా పాన్‌కు దరఖాస్తు చేసుకోవాలని చెప్పింది. మే 31లోగా ఈ దరఖాస్తులు సమర్పించాలని తెలిపింది.