పాన్ కార్డులో తప్పనిసరిగా తండ్రి పేరును నమోదు చెయ్యాలన్న నిబంధన వుంది. ఇప్పుడా నిబంధనను కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సీబీడీటీ) సడలించింది. తల్లి మాత్రమే ఉండేవారికి ఈ సడలింపు వర్తిస్తుంది. తండ్రి మరణించినా, విడిచి వెళ్ళిపోయినా వారి పేరును దరఖాస్తులో నమోదు చెయ్యాల్సిన అవసరం లేదని పేర్కొంది.ఈ మేరకు నిబంధనలను సవరిస్తూ సీబీడీటీ మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. వచ్చే నెల 5 నుంచి ఈ మార్పులు అమలులోకి వస్తాయని స్పష్టం చేసింది. ఇదిలావుండగా ఆర్థిక సంవత్సరంలో రూ.2.5 లక్షలకు మించి లావాదేవీలు జరిపే సంస్థలు తప్పనిసరిగా పాన్కు దరఖాస్తు చేసుకోవాలని చెప్పింది. మే 31లోగా ఈ దరఖాస్తులు సమర్పించాలని తెలిపింది.