రాజ్యసభలో ఇక అడుక్కోరు..  లేవనెత్తుతారు.. - MicTv.in - Telugu News
mictv telugu

రాజ్యసభలో ఇక అడుక్కోరు..  లేవనెత్తుతారు..

December 15, 2017

‘‘మనది స్వాతంత్య్ర దేశం కాబట్టి ఇకనుంచి సభలో ఎవరూ ‘ ఐ బెగ్ యూ ( నేను వేడుకుంటున్నాను ) ’ అని అడుక్కోవాల్సిన అవసరం లేదు.. దానికి బదులుగా ‘నేను లేవనెత్తుతున్నాను ’ అని చెప్పాలి’’ అని సూచించారు రాజ్యసభ చైర్మన్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు.

శుక్రవారం పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో రాజ్యసభలో చైర్మన్‌గా కొలువుదీరిన వెంకయ్యనాయుడు.  సభలోకి రాగానే సభ్యులందరికీ నమస్కారం చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ‘ మనకు స్వాతంత్య్రం రాక మునుపు నేను వేడుకుంటున్నాను అనే పదాన్ని వాడేవారు.

సాధారణంగా చట్టసభలో సభ్యులు తాము చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పడానికి ముందు టేబుల్‌పై తమ చేతుల్లో ఉన్న పత్రాలను పెడుతూ ‘ ఐ బెగ్‌ యూ ‘ ( నేను వేడుకుంటున్నాను ) అనే పదంతో చైర్మన్‌కు విజ్క్షప్తి చేస్తారు. ఇప్పుడు మనం స్వేచ్ఛా స్వాతంత్య్రాలు కలిగినవారం. కాబట్టి ఆ పదానికి బదులు ‘ నేను లేవనెత్తుతున్నాను ‘ అనే మాటను ఉపయోగించాలని ’ చెప్పారు. ఈ సవరణను ప్రతి ఒక్క చట్టసభ్యుడు పాటించాలని విజ్ఞప్తి చేశారు.