చంద్రబాబును పిలవొద్దని మోదీనే చెప్పాడు! - MicTv.in - Telugu News
mictv telugu

చంద్రబాబును పిలవొద్దని మోదీనే చెప్పాడు!

November 30, 2017

మెట్రో రైలు ప్రారంభానికి, ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సుకు ఎక్కడెక్కడినుంచో అతిథులు భాగ్యనగరికి వచ్చారు. కానీ పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును ఎందుకు పిలవలేదనే సందేహం అందరిలోనూ కలుగుతోంది. హైటెక్ సిటీని కట్టించింది నేనే, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు కట్టింది నేనే అని చెప్పే చంద్రబాబును ప్రధాని ఎందుకు పిలవలేదు అనేది ఎవ్వరికీ అర్థంకాని ప్రశ్న! హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కనుక ఏపీ సీఎంను పిలవకపోవడం అనుమానాలకు తావిస్తోంది.అయితే ఈ ప్రపంచ సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించింది నీతి అయోగ్. మరి నీతి అయోగ్ చంద్రబాబును కావాలానే పిలవలేదనే అనుమానాలు కలుగుతున్నాయి. ప్రధాని మోదీనే చంద్రబాబును  కావాలనే ఆహ్వానించలేదని తెలుస్తోంది. ఒకవేళ చంద్రబాబును పిలిస్తే గతంలో హైదరాబాద్‌లో చేసిన అభివృద్ధి గురించే పదే పదే మాట్లాడతాడనే భయంతోనే పిలవలేదని తెలుస్తోంది. బాబు చరిత్రా అంతా తోడితే ఎంతో కొంత కాంగ్రెస్ ప్రస్తావనా వచ్చి సదస్సు కాస్తా రాజకీయం అవుతుందనని నీతి ఆయోగ్ అధికారులు కూడా భావించినట్లు తెలుస్తోంది.

కాగా, ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌కు ఇవ్వాల్సినే నిధులు ఇవ్వకుండా  మోదీ చంద్రబాబును ఇబ్బందిపెడుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. కేంద్రాన్ని నిధులను గట్టిగా అడిగితే మోదీ ఓటుకు నోటు కేసు చూపి చంద్రబాబును నోరెత్తకుండా చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సంవత్సరం నుండి బాబు మోదీ అపాయింట్‌మెంట్ కోసం ఎదురు చూస్తున్నా కూడా మోదీ.. బాబుకు అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదట. 

పిలిపించి ఉంటే గౌరవంగా ఉండేది కదా..

అయితే బాబును మెట్రో, జీఈఎస్ సదస్సుకు ఆహ్వానించి ఉంటే హుందాగా ఉండేదన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఆయన తొమ్మిదేళ్లు ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా ఉండిన నేత అని, ఆయనవి అతిశయోక్తులే అయినా హైటెక్ సిటీ, ఎయిర్ పోర్టు వంటి పలు సిటీ ప్రాజెక్టుల్లో ఆయన కృషి ఉన్న వాస్తవాన్ని మరచిపోవద్దని అధికారులు అంటున్నారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కనుక ఆ హోదా విషయంలోనైనా బాబును ఆహ్వానించి ఉండాల్సిందని పేర్కొంటున్నారు.