నోకియా 2 బండిల్ ఆఫర్ - MicTv.in - Telugu News
mictv telugu

నోకియా 2 బండిల్ ఆఫర్

November 24, 2017

పాత కష్టమర్లను తిరిగి రప్పించుకునే క్రమంలో బడ్జెట్ ధరల్లో ఆకట్టుకునే ఫీచర్లతో ఉండే నోకియా స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేస్తోంది. ఇటీవల విడుదలైన బడ్జెట్ ఫోన్ నోకియా 2, రిలియన్స్ జియోతో కలిసి బండిల్ ఆఫర్‌ను ప్రకటించింది. నేటి నుంచి నోకియా 2 ఫోన్  అన్నీ రిటైల్ మొబైల్ స్టోర్లలో అందుబాటులో వుంటుంది. ఈ ఫోన్‌ను కొనుగోలు చేసిన కష్టమర్లకు 45జీబీ 4జీ డేటా ఉచితంగా లభిస్తుంది. వచ్చే ఏడాది 31 ఆగస్టు వరకు 9 రీచార్జులతో ఈ ఆఫర్ పొందవచ్చు. అలాగే ఏడాది పాటు కాంప్లిమెంటరీ కింద యాక్సిడెంటల్ డ్యామేజీ భీమాను కల్పిస్తున్నది.  ఈ బీమా రూ.1000తో కోటక్ 811 సేవింగ్స్ ఖాతా తెరిచిన వారికి వర్తిస్తుందని హెచ్ఎండీ గ్లోబల్ ఇండియా హెడ్ అజయ్ మెహతా తెలిపారు. దీని ధర రూ. 6,999.
నోకియా 2 ఫీచర్లు :

1జీబీ ర్యామ్, 8జీబీ ఇంటర్నల్ మెమొరీ, 5 అంగుళాల డిస్‌ప్లే, 128 జీబీ వరకు పెంచుకునే వెసులుబాటు, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా,  8 ఎంపీ ప్రైమరీ, 4100 ఎంఏహెచ్ రిమూవబుల్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఓస్