నోకియా నుంచి బడా మొబైల్ ఫోన్ - MicTv.in - Telugu News
mictv telugu

నోకియా నుంచి బడా మొబైల్ ఫోన్

February 15, 2018

నోకియా నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్‌‌‌ను మార్కెట్లోకి తీసుకురానుంది. ‘నోకియా 7ప్లస్’ పేరుతో  విడుదల కానున్న ఈ ఫోన్ పొడవు ఆరు అంగుళాలు. హెచ్‌ఎండీ గ్లోబల్ ఈ నెల 25న దీన్ని మార్కెట్లోకి  విడుదల చేయనుంది. ఇది ఆండ్రాయిడ్ వన్ ఎడిషన్ ఫోన్ కావడం మరో విశేషం. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లు ఉన్నాయి. దీని ధర దాదాపు రూ. 27 వేలు.నోకియా 7 ప్లస్ ఫీచర్లు…

6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ ఫుల్ వ్యూ డిస్‌ప్లే

2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్

గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్

4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్

డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో

12, 13 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు

16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా

ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ

డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5, యూఎస్‌బీ టైప్ సి, ఫాస్ట్ చార్జింగ్.