‘అణు’ సొరంగం కూలి 200 మంది బలి - MicTv.in - Telugu News
mictv telugu

‘అణు’ సొరంగం కూలి 200 మంది బలి

October 31, 2017

ఉత్తర కొరియా ఇటీవల అణు‌ప్రయోగం జరిపిన ప్రాంతంలో  ఓ భారీ సొరంగం కుప్పకూలింది. ఈ ఘటనలో  200 మంది మరణించారు.

 ఈ విషయాన్ని జపాన్ మీడియా వెలుగులోకి తెచ్చింది. ఈ నెల 10న ఓ సైనిక స్థావరం వద్ద నిర్మాణ పనులు  చేపడుతుండగా సొరంగం ఒక్కసారిగా కూప్పకూలిపొయింది. మెుదట సొరంగంలో 100 మంది చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని చర్యలు చేపడుతుండగా మిగిలిన భాగం వారిపై  కూలిపోయింది. దాంతో మరో 100 మంది మరణించారు.  ఈ  ఘటనపై ఇప్పటివరకు ఉత్తర కొరియా  ప్రభుత్వం స్పందించలేదు. ఆ ప్రాంతంలో హైడ్రోజన్  బాంబును పరీక్షించడంతో ఆ ప్రాంతం పూర్తిగా దెబ్బతింది. దాంతోనే ఈ ప్రమాదం సంభవించిందని జపాన్ మీడియా పేర్కొంది.