కోర్టును ధిక్కరించి మహిళా ఎంపీ రెండోపెళ్లి - MicTv.in - Telugu News
mictv telugu

కోర్టును ధిక్కరించి మహిళా ఎంపీ రెండోపెళ్లి

March 26, 2018

కోర్టు తీర్పును లెక్క చేయకుండా  అన్నాడీఎంకే రాజ్యసభ సభ్యురాలైన శశికళ పుష్ప తన సన్నిహితుడైన  రామస్వామి రెండో పెళ్లి చేసుకున్నారు. వరుడు ఆమెకు న్యాయసలహాదారు. ఇది ఇద్దరికీ అది రెండోపెళ్లి.  రామస్వామికి ఇంతకు ముందే పెళ్ళి అయిందని తెలుస్తోంది. ‘నేను రామస్వామి భార్యనే ’ అని మహిళ తెరపైకి వచ్చింది. ఆధారాలతో కోర్టులో కేసు వేసింది.  దీనిపై స్పందించిన మదురై కోర్టు… విడాకులు తీసుకోకుండా మరో మహిళను వివాహం చేసుకోవడం నేరమని స్టే విధించింది. ఒకవేళ చేసుకుంటే చట్టరీత్యా నేరమని కూడా హెచ్చరించింది. ఈ పెళ్లిపై కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందన్నది ఆసక్తిగా మారింది. అయినా వారు కోర్టు తీర్పును ధిక్కరించి ఈ పెళ్ళి చేసుకోవటం చర్చనీయాంశంగా మారింది. సోమవారం ఢిల్లీలోని ఓ హోటల్‌లో వీరి పెళ్లి జరిగింది. అత్యంత సన్నిహితుల మధ్య.. హిందూ సంప్రదాయ ప్రకారం వారి పెళ్ళి జరిగింది. సాయంత్రం వీరి రిసెప్షన్ జరగనుంది