అర్జున్ రెడ్డా.. మజాకా! - MicTv.in - Telugu News
mictv telugu

అర్జున్ రెడ్డా.. మజాకా!

September 9, 2017

 

టాలీవుడ్ సెన్సేషనల్, కాంట్రావర్షియల్ హిట్ మూవీ ‘అర్జున్ రెడ్డి’ బాక్సాఫీస్ వసూళ్లలోనూ దూసుకుపోతోంది. రూ. 4 కోట్ల బడ్జెట్లో నిర్మితమైన ట్రెండ్ సెట్టర్ మూవీ ఇప్పటివరకు  రూ. 40 కోట్లను కొల్లగొట్టి, నిర్మాతకు  కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పుడు ఎక్కడ, ఏ థియేటర్లో చూసినా అర్జున్ రెడ్డి సినిమా ప్రేక్షకులే. హౌస్ ఫుల్ కలెక్షన్లతో టాకీసులన్నీ కిటకిటలాడుతున్నాయి. ఈ సినిమాలో ఒక్క హీరో తప్ప అందరూ కొత్తవాళ్ళే. కానీ హిట్టు కొట్టారు. ఎన్నో వివాదాలతో వచ్చిన అర్జున్ రెడ్డి సంచలనాన్ని క్రియేట్ చేసింది.  డైరెక్టర్, హీరో, హీరోయిన్, హీరో ఫ్రెండు ఇలా ఈ సినిమాలో ప్రతీ పాత్రకు, ప్రతీ టెక్నీషియన్ కు మంచి పేరూ, అవకాశాలు కూడా వస్తున్నాయి. పెళ్ళి చూపులు సినిమా కలెక్షన్లను దాటిపోయింది. ఇంకా 50 రోజులు కూడా అవలేదు. అప్పుడే ఇన్ని కలెక్షన్లా ? ఇంకా ముందు ముందు ఈ సినిమా కలెక్షన్ల సునామీని సృష్టిస్తుందని అంచనా వేస్తున్నాయి ట్రేడ్ వర్గాలు.