mictv telugu

మోదీకి ఓటెయ్యండి.. శుభలేఖలో కోరిన వరుడు..

February 12, 2019

ఇష్టమైన నాయకుణ్ణి గెలిపించుకునే క్రమంలో కొందరు రకరకాల జిమ్మిక్కులు చేస్తుంటారు. కాస్త వినూత్నంగా ఆలోచించి తమ నాయకుడికి ఓటు వేయమని చెప్తారు.

ఈ నేపథ్యంలో ఓ యువకుడు తన పెండ్లి పత్రికలో.. వచ్చే ఎన్నికల్లో ప్రధాని మోదీకి ఓటెయ్యమని రాయించాడు. పత్రిక తీసుకున్నవాళ్ళు ఖచ్చితంగా చదువుతారని అనుకున్నట్టున్నాడు.

Telugu news Not money Hyderabad bridegroom asks guests to Vote for Modi as wedding gift .

శంషాబాద్‌ వాసి యండె సుభాష్‌రావు నాలుగో కుమారుడు ముఖేష్‌ వివాహం ఈ నెల 21న జరగనుంది. అయితే తన వివాహ ఆహ్వాన పత్రికలో ‘వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో మీ ఓటు మోదీకి వెయ్యండి. మా పెళ్లికి మీరు ఇచ్చే కానుకే ఇదే’ అంటూ ముద్రించి మోదీపై తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఈ విషయమై ముఖేష్ స్పందిస్తూ.. ప్రధాని మోదీ దేశాన్ని అభివృద్ధి చేస్తున్నారు. నేను ఆయనకు చాలా పెద్ద అభిమానిని. ఇలా ఆయనకు మద్దతిచ్చి నా వంతుగా దేశం కోసం కొంతైనా చేస్తున్నాననే భావనతోనే ఇలా తన పెళ్ళి పత్రికలో ముద్రించానని తెలిపారు.

Telugu news Not money Hyderabad bridegroom asks guests to Vote for Modi as wedding gift