‘నోటా’లో కేటీఆర్‌ను ఫాలో అయ్యాను.. - MicTv.in - Telugu News
mictv telugu

‘నోటా’లో కేటీఆర్‌ను ఫాలో అయ్యాను..

October 5, 2018

యంగ్ ఫేవరేట్ స్టార్ విజయ్ దేవరకొండ తాజాగా నటించిన ‘నోటా’ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. పూర్తి రాజకీయ అస్త్రంగా ఈ చిత్రం రూపుదిద్దుకుంది. ఈ సినిమా కథ నచ్చడంతో వెంటనే ఒప్పుకున్నట్టు విజయ్ చెప్పాడు. యువ సీఎం పాత్రలో విజయ్ ఒదిగిపోయాడు. అయితే తాను ఈ పాత్రలో నటించి ఒప్పించడానికి తెలంగాణ ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్‌నే అనుకరించానని పేర్కొన్నాడు.

In the 'Nota', I have fallow the ktr…

వ్యక్తిగతంగా కేటీఆర్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పాడు. చాలా విషయాల్లో కేటీఆర్ మాటలు తనను ఎంతగానో ప్రభావితం చేశాయన్నాడు. గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కే ఓటు వేశానని, తెలంగాణ ప్రభుత్వ పనితీరు బాగా నచ్చిందని తెలిపాడు. ఈమధ్య సోషల్ మీడియాలో ఓ అమ్మాయితో వైరల్ అవుతున్న ఫోటో గురించి విజయ్ స్పందించాడు.

సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఫొటో రెండేళ్ల క్రితం దిగింది. ఇప్పుడు బయటికి వచ్చింది. ఆ ఫొటోలో వున్నది నేనే. దాన్ని పట్టుకుని అనవసరంగా కామెంట్లు చేస్తున్నారని అన్నాడు.