ఎన్టీఆర్ బయోపిక్‌కు రంగం సిద్ధం - MicTv.in - Telugu News
mictv telugu

ఎన్టీఆర్ బయోపిక్‌కు రంగం సిద్ధం

October 26, 2017

బాలకృష్ణ కథానాయుడిగా ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా, సినిమా తెరకెక్కించడానికి రంగం సిద్దం  అవుతుంది. తేజ దర్శకత్వం  వహిస్తారు.ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్టు పనులు వేగంగా జరుగుతున్నాయి.

ఈ సినిమాకి పేరు కూడా ఖరారైంది.  ఈ సినిమా కోసం ‘ఎన్టీఆర్ ’అనే పేరుని ఫిల్మ్ ఛాంబర్‌లో నమోదు చేశారు.  ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేస్తారు.  ఈ చిత్రాన్ని హిందీలో కూడా తీసేందుకు చిత్రయూనిట్ సిద్ధం అవుతున్నారట.  ఈ సినిమాలోని మిగతా నటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో ప్రకటిస్తారు.  ప్రస్తుతం బాలకృష్ణ  కె.ఎస్ రవికుమార్ దర్శకత్వంలో  తెరకెక్కుతున్న‘ జై సింహా’ సినిమా షూటింగ్‌లో బీజీగా ఉన్నాడు.