బాలయ్య సరసన దీపిక పదుకునె! - MicTv.in - Telugu News
mictv telugu

బాలయ్య సరసన దీపిక పదుకునె!

April 4, 2018

ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న సినిమా షూటింగ్ ఇటీవల మొదలైన సంగతి తెలిసిందే. నటఃీమణుల ఎంపికను చిత్ర యూనిట్ చేస్తోంది. ఇక చిత్రంలో ఎన్టీఆర్ గా నటిస్తున్న బాలయ్య  సరసన బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకునెను ఎంపిక చేశారని టాక్. శ్రీదేవి పాత్ర కోసం ఆమెను తీసుకుంటున్నారట. ఎన్టీఆర్,శ్రీదేవి కలసి నటించిన బొబ్బలి పులి, వేటగాడు వంటి సినిమాలు భారీ విజయాలు సాధించాయి. కాగా, ఎన్టీఆర్ బయోపిక్‌లో ఆయన  భార్యగా బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటిస్తోంది. నాదేళ్ల బాస్కర్ రావు పాత్రలో పరేశ్ రావల్ నటిస్తున్నాడు. ఈ చిత్రంలో బాలకృష్ణ ఏకంగా 64 పాత్రల్లో కనిపించునున్నారు.ఈ మూవీ తేజ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ భాష‌ల‌లో రూపొందించ‌నున్నారు. బాల‌కృష్ణ‌, సాయి కొర్రపాటి, విష్ణు వ‌ర్ధన్ ఇందూరి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ద‌స‌రా కానుక‌గా విడుద‌ల కానుంది. ఎంతో ప్ర‌తిష్టాత్మకంగా రూపొంద‌నున్న ఈ చిత్రానికి కీర‌వాణి సంగీతం అందించ‌నుండ‌గా, సంతోష్ తుండియిల్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా పని చేయ‌నున్నారు. బుర్రా సాయి మాధ‌వ్ చిత్రానికి మాటలు అందిస్తున్నారు. ఎన్టీఆర్ చిత్రంలో ఆయ‌న సినిమాల, రాజ‌కీయాల‌కి సంబంధించిన విష‌యాల‌ని చూపించ‌నున్నారు.