అమ్మకానికి ‘ఎన్టీఆర్’ ఇల్లు - MicTv.in - Telugu News
mictv telugu

అమ్మకానికి ‘ఎన్టీఆర్’ ఇల్లు

November 3, 2017

తమిళనాడులో టీ నగర్‌లో ఉన్న నందమూరి తారకరామారావు ఇల్లు అమ్మకానికి పెట్టారు. గేటుకు ‘ఇల్లు అమ్మబడును’ అని బ్రోకర్ ఫోన్ నెంబర్ కూడా పెట్టారు. తమిళనాడులో ఉన్నప్పడు ఎన్టీఆర్‌కు ఆ ఇంటితో ఉన్న అనుబంధమే వేరని, ఎన్నో మధుర జ్ఞాపకాలకు నిలయం ఆ ఇల్లు అని, ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

దూర ప్రాంతాల నుంచి తమిళనాడు వెళ్లే అభిమానులకు  ఆ ఇల్లు నీడ నిచ్చేదట. రెండస్థుల ఈ మిద్దెలో మీద పిల్లల గదులు, ఎన్టీఆర్‌బెడ్ రూం ఉండేది. కింద ఆఫీస్, సందర్శకులకోసం మరోగది, మేకప్ రూం ఉండేవి. మరి ఎన్టీఆర్ జీవించిన ఈ ఇల్లును స్వంతం చేసుకునే వారు ఎక్కడున్నారో? ఎవరి దీన్ని కొంటారో చూడాలె. కనీ ఈ విషయం రాంగోపాల్ వర్మకు తెలుసో లేదో, ఒకవేళ తెలిస్తే వెంటనే కొని ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా అక్కడే తీస్తాడు గావచ్చు.