లక్ష్మీపార్వతి మౌనదీక్ష - MicTv.in - Telugu News
mictv telugu

లక్ష్మీపార్వతి మౌనదీక్ష

October 26, 2017

ప్రముఖ నటుడు, దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ భార్య  లక్ష్మీ పార్వతి గురువారం ఎన్టీఆర్ ఘాట్ వద్ద మౌనదీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ‘ కొన్ని రోజులుగా జరుగుతున్న పరిమాణాలు నన్ను చాలా బాధపెడుతున్నాయి.

 ఎన్టీఆర్ ఘాట్ దగ్గర కూర్చుంటే ఆ బాధల నుంచి కాస్త ఉపశమనం దొరుకుతుందని  వచ్చాను. నాభర్తకు జరిగిన అన్యాయంపై చాలా ఏళ్ళుగా పోరాటం చేస్తున్నాను, నాకు ఆయన ఆత్మ అండంగా ఉంటుంది. నా జీవిత  చరిత్ర ఆధారంగా ‘లక్ష్మీ వీరగ్రంథం’   సినిమా తీయడం  చట్ట విరుద్దం. నా అనుమతి లేకుండా ఇలా సినిమా తీస్తే తీవ్ర పరిమాణాలు ఉంటాయి. ‘లక్ష్మీ వీరగ్రంధం’ సినిమా గురించి నన్ను ఎవరూ సంప్రదించలేదని’ ఆమె పేర్కొన్నారు.