రీ ఎంట్రీకి నో చెప్పిన లయ... - MicTv.in - Telugu News
mictv telugu

రీ ఎంట్రీకి నో చెప్పిన లయ…

March 5, 2018

ఎన్టీఆర్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివ్రికమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్నతాజా చిత్రంలో నటి లయను ముఖ్యమైన పాత్రలో తీసుకుకోవాలని  భావించారు. కానీ అందుకు లయ సమ్మతం తెలపలేదు. లయ అనగానే ఠక్కున గుర్తుకువచ్చే మంచి సినిమాలు ‘ స్వయంవరం ’ ‘ మనోహరం ’. ఎన్టీఆర్ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో  లయ అయితే బాగుంటుదని భావించిన త్రివ్రిక్రమ్ ఆమెను సంప్రదించారు. అయితే కారణం ఏమిటో తెలియదుగానీ ఈ సినిమాలో ఆమె నటించడానికి పెద్దగా ఆసక్తి చూపలేదనీ,సున్నితంగా తిరస్కరించిందని ఫిల్మ్‌నగర్ సమాచారం.