ఆర్జీవీతో ఎన్టీఆర్ ఏమన్నాడంటే.. - MicTv.in - Telugu News
mictv telugu

ఆర్జీవీతో ఎన్టీఆర్ ఏమన్నాడంటే..

October 26, 2017

సీనియర్ ఎన్టీఆర్  రాంగోపాల్ వర్మకు ఆకాశవాణి ద్వారా సందేశం పంపాడండోయ్. ఏంటి నమ్మబుద్ది కావడంలేదా?  మీరు నమ్మరనే..రాంగోపాల్ వర్మ  ఆ సందేశాన్ని, గతంలో ఎన్టీఆర్‌ను కలిసిన ఫోటోతో జతచేసి య్యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశాడు. అంతేకాదు ఆ లింక్‌ను తన ఫేస్‌బుక్‌లోనూ పెట్టి ‘ఇది సాక్షాత్తూ ఎన్టీఆర్ గారే నాకు సందేశాన్ని ఆకాశవాణి ద్వారా పంపారు.. ఇది నమ్మని వాళ్ళందరూ కచ్ఛితంగా నరకానికి పోతారని కూడా చెప్పమన్నారు’ అని  పోస్ట్ చేశాడు. ఈ ఆడియోలో ఏముందంటే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’  సినిమా తీస్తున్నందుకు వర్మని మెచ్చుకుంటూ, పొగడ్తలతో  ముంచెత్తారు ఎన్టీఆర్. మరి ఎన్టీఆర్ పంపిన ఆ ఆకాశవాణిని మీరు కూడా వినండి.