టీటీడీపీని ఎన్టీఆర్‌కు అప్పగించండి! - MicTv.in - Telugu News
mictv telugu

టీటీడీపీని ఎన్టీఆర్‌కు అప్పగించండి!

February 28, 2018

బుధవారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో చంద్రబాబు పార్టీ నేతలతో, కార్యకర్తలతో సమావేశమయ్యారు. అయితే ఈ సమావేశంలో కార్యకర్తలు నినాదాలు చేస్తూ…టీటీడీపీ బాధ్యతలను హీరో జూనియర్ ఎన్టీఆర్‌కు అప్పగించాలంటూ గోల చేశారు.

అంతేకాదు టీటీడీపీని టీఆర్ఎస్‌లో విలీనం చేస్తే ఆత్మహత్యలు చేసుకుంటామని హెచ్చరించారు. టీఆర్ఎస్, బీజేపీలతో పొత్తులు కూడా పెట్టుకోవద్దంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. అయితే ఈ విషయాలపై చంద్రబాబు స్పందిస్తూ..కార్యకర్తల అభిప్రాయాల మేరకే పొత్తులు ఉంటాయని స్పష్టం చేసినట్టు సమాచారం.

అయితే టీడీపీ పార్టీకి తాను ఎల్లవేలలా విధేయుడనై ఉంటానని గతంలో జూనియర్ ఎన్టీఆర్ స్పష్టం చేసిన విషయం కూడా తెలిసిందే. మరి కార్యకర్తల కోరిక మేరకు టీటీడీపీ బాధ్యతలను చంద్రబాబు ఎన్టీఆర్‌కు అప్పగిస్తారో లేదో చూడాలె.