జయలలితగా కాజల్.. - MicTv.in - Telugu News
mictv telugu

జయలలితగా కాజల్..

April 10, 2018

ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా  రూపోందిస్తున్నబయోపిక్ కోసం పాత్ర ఎంపిక వేగంగా సాగుతోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌గా బాలకృష్ణ నటిస్తుండగా తేజ దర్శకత్వం వహిస్తున్నాడు. ఎన్టీఆర్ సరసన నటించిన కథానాయికలను ఎంపిక చేస్తున్నారు. నయనతార, సమంత, విద్యాబాలన్ తదితరుల పేర్లను పరిశీలిస్తున్నారు.

ఎన్టీఆర్‌తో  కలిసి ఎన్నో సినిమాల్లో నటించిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత పాత్రను కాజల్ పోషించనున్నట్లు తెలుస్తోంది. చిన్న పాత్రే అయినా సినిమాలతోపాటు రాజకీయాల్లోనూ కీలకమైన పాత్ర కనుక దీనికి కాజల్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ జీవితంతో ముడిపడిన కృష్ణ, నాగేశ్వరరావు, కేవీ రెడ్డి, బీఎన్ రెడ్డి, సావిత్రి, జమున, కృష్ణకుమారి వంటి వారిని కూడా చూపేందుకు చాలా మంది ప్రముఖ తారలను తీసుకుంటున్నారు. వీరు కేవలం రెండు మూడు నిమిషాల సీన్లతో కనిపిస్తారని తెలుస్తోంది.