ఇది కథ కాదు.. భార్యను ప్రియుడికిచ్చి పెళ్లిచేసిన భర్త - MicTv.in - Telugu News
mictv telugu

ఇది కథ కాదు.. భార్యను ప్రియుడికిచ్చి పెళ్లిచేసిన భర్త

March 12, 2018

‘కన్యదానం’ సినిమాలో హీరో శ్రీకాంత్ పెళ్లి చేసుకున్న అమ్మాయి అంతకుముందే ఉపేంద్రను ప్రేమించి ఉంటుంది. వారి ప్రేమను తెలుసుకున్న శ్రీకాంత్ తన భార్యను తండ్రిలా దగ్గర  ఉండి కన్యదానం చేసి తను కోరుకున్నవాడితో పెళ్లి చేస్తాడు. అలాంటి సంఘటననే ఒడిశాలో చోటు చేసుకుంది.సుందర్‌గఢ్ జిల్లా పామర గ్రామానికి చెందిన బాసుదేవ్ టప్పో.. జార్సుగూడ గ్రామానికి చెందిన 24 ఏళ్ల కౌసల్య అనే యువతిని ఈ నెల 4న వివాహం చేసుకున్నాడు. తన భార్య వేరే వ్యక్తిని ప్రేమిస్తోందని తెలుసుకున్న టప్పో వారికి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాడు. తన భార్య, తల్లిదండ్రలు, సోదరులతో మాట్లాడి వారిని పెళ్లికి ఒప్పించాడు.  గ్రామ సర్పంచ్‌ సమక్షంలో వారికి వివాహం జరిపించాడు. ఈ పెళ్లి జరగకుంటే ముగ్గురి జీవితాలు నాశనం అయ్యేవని టప్పో అన్నాడు.