కోర్టులోనే భార్యను చంపిన భర్త - MicTv.in - Telugu News
mictv telugu

కోర్టులోనే భార్యను చంపిన భర్త

April 24, 2018

కోర్టు ఆవరణలోనే ఓ వ్యక్తి తన భార్యను దారుణంగా హత్య చేశాడు.  ఒడిశాలోని నంబల్‌పూర్‌లో సోమవారం జరిగింది. సింధూర్‌సంక్ గ్రామానికి చెందిన రమేష్ కంవార్ ,సంగీత చౌదరి‌ని ప్రేమించి ఆరు నెలల కిందట వివాహం చేసుకున్నాడు. గత మూడు నెలల నుంచి వీరి మధ్య తరుచూ గొడవలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో ఇద్దరూ కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.కోర్టు ఆదేశాల మేరుకు సోమవారం ఇద్దరూ కౌన్సెలింగ్ కోసం ,కోర్టుకు ఉదయం వచ్చారు. అక్కడ న్యాయమూర్తులు ఇద్దరికి కౌన్సెలింగ్ చేస్తుండగానే ఇద్దరి మద్య మాటామాటా పెరిగి గొడవ పడ్డారు.రమేష్‌ తనతో తెచ్చుకున్న గొడ్డలితో సంగీత, ఆమె తల్లి లలిత, అక్క కుమార్తె శివాని(4)లపై దాడిచేశాడు. దీంతో తీవ్రంగా గాయపడిన సంగీతను ఆసుపత్రికి తరలించారు.చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. సంబల్‌పూర్‌ పోలీసులు రమేష్‌ను అదుపులోకి తీసుకుని అతనిపై కేసు నమోదు చేశారు.