ఆ గుడిలోకి పురుషులకు ప్రవేశం లేదు.. కానీ  విగ్రహాలను తరలించారు - MicTv.in - Telugu News
mictv telugu

ఆ గుడిలోకి పురుషులకు ప్రవేశం లేదు.. కానీ  విగ్రహాలను తరలించారు

April 23, 2018

శబరిమల ఆలయంలోకి ఆడవారికి  ప్రవేశం ఉండదు. అలాగే కొన్ని ఆలయాల్లోకి మగవారికి ప్రవేశం ఉండదు. గత కొన్ని దశాబ్దాల నుంచి ఆ గుడిలోకి మగవారికి అనుమతి లేదు. కానీ 400 ఏళ్ల చరిత్ర కలిగిన  ఆ గుడిలోకి తొలిసారిగా పురుషులు ప్రవేశించారు. ఈ ఘటన ఒడిశాలోని కేంద్రపారా జిల్లాలో సతాభ్యా అనే లంక గ్రామంలో చోటుచేసుకుంది.

గ్రామంలో పంచువారి అమ్మవారి ఆలయం ఉంది. చారిత్రక నేపథ్యం ఉన్న ఆ గుడిలో మగవాళ్లకు అనుమతి లేదు. ఐదుగురు దళిత  మహిళలు( వివాహితులు) మాత్రం నిత్యం ఆలయ శుద్ది,ఇతర పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.ఇదిలావుండగా బంగాళ ఖాతంలో నీటి మట్టం పెరగడం వల్ల కొన్ని గ్రామాలు ముంపునకు గురయ్యాయి. అందులో  సతాభ్యా గ్రామం కూడా ముంపుకు గురి అయింది. దీంతో ఒడిశా ప్రభుత్వం గ్రామంలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

అయితే ఇంతకాలం తమ గ్రామాన్ని రక్షించిన అమ్మవారిని వదిలేయటానికి  ప్రజలు సిద్దంగా లేరు. ఈ నేపథ్యంలో అమ్మవారి విగ్రహాలను సతాభ్యా నుంచి 12 కిలో మీటర్ల దూరంలో ఉన్న బాగాపాటియా గ్రామంలో కొత్త ఆలయానికి తరలించాలనుకున్నారు. అయితే మహిళ పూజారులకు ఆ విగ్రహాలను తరలించడం కష్టతరంగా మారింది. ఐదు భారీ రాతి విగ్రహాలు ఒక్కొక్కటి టన్నున్నర బరువు ఉన్నాయి. దీంతో వాళ్లు పురుషుల సాయం తీసుకున్నారు. ఏప్పిల్ 20న ఐదురుగు వ్యక్తులు విగ్రహాలను తొలగించి, ప్రడవ ప్రయాణం ద్వారా కొత్త ఆలయానికి తరలించారు. ఆ తర్వాత  విగ్రహాలను శుద్ది చేసి,తిరిగి పూజాలు నిర్వహించారు.