mictv telugu

పొలాల్లో ఆడుకుంటున్న పిల్లలను పట్టుకెళ్లిన అధికారులు

January 13, 2019

పండగ కోసం ఇంటికి వెళ్లిన పిల్లలు సరదాగా పొలాల్లో ఆడుకుంటున్నారు. ఇంతలో కొందరు వచ్చి వాళ్లను లాక్కెళ్లిపోయారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారో పాపం వాళ్ళకు తెలియదు. అనంతరం పిల్లల తల్లిదండ్రులు వచ్చి తమ పిల్లలను ఎందుకు తీసుకొచ్చారని అడగ్గా తాము చైల్డ్ వెల్ఫేర్ అధికారులం అని చెప్పగానే ఆశ్చర్యపోవడం వారి వంతైంది. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకుంది. పొలాల్లో పిల్లలు ఆడుకుంటుంటే..వాళ్లను చూసి పనిచేసే బాల కార్మికులుగా భావించారు అధికారులు. ఆపరేషన్‌ ముస్కాన్‌ అధికారులమంటూ గద్వాల, మల్దకల్‌, కేటీదొడ్డి ప్రాంతాల్లో పొలాల్లో ఉన్న కొందరు బాలికలను బాలసదన్‌కు తీస్కెళ్లిపోయారు.

Telugu news Officials holding the children playing in the fields

అధికారుల తీరుపై చిన్నారుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తమ పిల్లలు హాస్టళ్లలో చదువుకుంటున్నారని, పొలాలు చూడటానికి వచ్చారని చెప్పినా వినిపించుకోకుండా మహబూబ్‌నగర్‌కు తరలించారు. బాలికలను చైల్డ్‌ వెల్ఫేర్‌కు పంపించి, వారి వయస్సు నిర్ధారణ అయ్యాక 14 ఏళ్లలోపు వారైతే గద్వాలలోని బాలసదన్‌కు.. అంతకంటే ఎక్కువుంటే.. స్టేట్‌ హోంకు తరలిస్తామన్నారు జిల్లా సంక్షేమ అధికారిణి పద్మావతి. కాగా, బాలసదన్‌కు తరలించిన వారిలో ఓ బాలిక ఆత్మహత్యాయత్నం చేసిందని ఆమె తోటి బాలికలు తెలిపారు. అయితే.. ఈ విషయాన్ని అధికారులు కొట్టి పారేశారు. Telugu news Officials holding the children playing in the fields