ఓలా పడవ కూడా వచ్చేసింది! - MicTv.in - Telugu News
mictv telugu

ఓలా పడవ కూడా వచ్చేసింది!

February 8, 2018

ఓలా యాప్ ద్వారా ఇంతవరకు కార్లు, బైక్ లు, ఆటోలు  బుక్ చేసుకొని ఎక్కడికైనా వెళ్లే సదుపాయం ఉంది కదా. కానీ ఇప్పుడు ఓలా సంస్థ తమ సేవలను  పడవలకు విస్తరించింది. అసోం రాష్ట్రంలో  తొలి ఓలా పడవను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సోనోవాల్ ప్రారంభించారు. అసోం రాజధాని గువహటిలోని లచిత్ ఘాట్ నుంచి గువహటి విమానాశ్రయానికి ఈ ఓలా సర్వీస్ ప్రారంభమైంది.మిషిన్ తో నడిచే బోట్లను ఓలా ఉపయోగిస్తుంది. ఈబోట్లు గంటకు 30 నిమిషాల వేగంతో వెళుతుంది. మామూలు బోట్లలో 45 నిమిషాలు పడితే ఓలా ఉపయోగించే ఈ బోట్లలో కేవలం 10 నిమిషాలే పడుతుంది. అంతేకాదు మచ్‌కోవా ఘాట్‌ నుంచి గువహటి ఉత్తర ప్రాంతానికి కూడా ఓలా హైస్పీడ్‌ బోట్లను నడపనుంది. మొదట ఓలా కార్లను అందుబాటులోకి తెచ్చింది. ఆతర్వాత ఆటోలు, బైకులను కూడా తీసుకొచ్చింది. ఇటు భూమ్మీద,అటు నీళ్ల మీద ప్రయాణానికి వాహనాలను ఏర్పాటు చేస్తున్న ఓలా… రాను రాను గాలిలో కూడా తమ సేవలను ప్రారంభిస్తుంది గావచ్చు.