మార్చి19న ఓలా,ఉబెర్‌ డ్రైవర్ల సమ్మె ! - MicTv.in - Telugu News
mictv telugu

మార్చి19న ఓలా,ఉబెర్‌ డ్రైవర్ల సమ్మె !

March 15, 2018

మనం ఎక్కడికి వెళ్లాలన్నా జేబులో డబ్బులు లేకున్నా సరే చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు క్యాబ్ బుక్ చేసుకుని ఎంచక్కా వెళ్లచ్చు. ఇప్పుడు క్యాబ్ సేవ సంస్థల్లో ఓలా, ఉబెర్ లు ముందంజలో ఉన్నాయి. అయితే అందులో పనిచేసే డ్రైవర్లు తమ సమస్యలు తీర్చాలంటూ ఎప్పటినుంచో చాలా సార్లు ధర్నాలకు దిగారు. అయితే  వారి సమస్యలను యాజమాన్యాలు పట్టించుకోలేదు. అందుకే మార్చి 19 న ఈ రెండు సంస్థలకు చెందిన క్యాబ్ డ్రైవర్లు కుటుంబాలతో సహో ఆయా సంస్థల ఆఫీసుల ముందు ధర్నా చేయనున్నారు. ఇప్పటికైనా తమ సమస్యలను పట్టించుకోకపోతే నరవధిక సమ్మె చేస్తామని వారు హెచ్చరిస్తున్నారు. ఎక్కువ గంటలు పనిచేసినా కూడా మాకు రావాల్సిన ఆదాయం రావడం లేదని తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. కంపెనీలకు లాభాలు వచ్చినా కూడా మమ్మల్ని పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. ఈ సమ్మె  ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, కోలకతా, హైదరాబాద్‌ వంటి పెద్ద నగరాల్లో చేయనున్నారు.

క్యాబ్ డ్రైవర్ల ప్రధాన డిమాండ్లు:

 

డ్రైవర్లకు ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి

కంపెనీ క్యాబ్‌లను  రద్దు చేయాలి

బ్లాక్‌ లిస్టులో పెట్టిన డ్రైవర్లను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలి

వాహనం ఆధారంగా చార్జీ నిర్ణయం

తక్కువ ధరల బుకింగ్‌ రద్దు చేయాలి