83 ఏళ్ల వయసులో ఇదేం పోయే కాలం! - MicTv.in - Telugu News
mictv telugu

83 ఏళ్ల వయసులో ఇదేం పోయే కాలం!

November 22, 2017

స్కూల్లో చదువుకుంటున్న అభం శుభం తెలియని చిన్న పిల్లలు కూడా కొందరు మృగాళ్ల అకృత్యాలకు బలి అవుతున్నారు.  హైదరాబాద్‌లోని కుషాయిగుడలో ఓ గవర్నమెంట్ స్కూల్ వద్ద ఉన్న ఓ భవనంలో పనిచేస్తున్న వాచ్‌మేన్ విద్యార్థిలకు చాకెట్లు ఇప్పిస్తానని చెప్పి, ఇద్దరు ఏడో తరగతి అమ్మాయిలపై లైంగిక దాడి చేశాడు. అంతేకాదు ఇంకో ఐదుగురు విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.

అత్యాచారానికి గురైన విద్యార్థినిలు తల్లిదండ్రులకు చెప్పడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రులు వాచ్‌మేన్‌పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు 83 ఏళ్ల ఆ వాచ్‌మేన్‌ను అరెస్ట్ చేశారు.