మన ఆడవాళ్లకు శిరోజాలు అంటే ఎంత ఇష్టమో చెప్పలేం. జుట్టును పెంచుకోవాడానికి నానా తిప్పలూ పడుతారు. కానీ విదేశాల్లోని ఆడవాళ్లు మాత్రం దీనికి భిన్నంగా పొట్టి జుట్టునే ఇష్టపడుతారు. కానీ వియాత్నాం కు చెందిన 81 ఏళ్ల త్రిన్ థి నగైన్ బామ్మ జుట్టు ఏకంగా 3 మీటర్ల పొడవు ఉంది. వియాత్నాంలో మహిళలు జుట్టు పెరగకుండా కొనలను అగ్గితో కాలుస్తారు. నగైన్ కూడా చిన్నతనంలో అలాగే చేసింది. కానీ అనుకోకుండా తలకు నిప్పంటుకొని గాయాలు అయ్యాయి. దాంతో నిప్పు పెట్టడం మానేసింది. ఫలితంగా జుట్టు పొడవుగా పెరగడంతో పాటు దువ్వుకోవడానికి వీలు లేకుండా అట్టలు కట్టింది. అప్పటి నుంచి జుట్టు కత్తిరించుకోవడం మానేసింది. 22 ఏళ్ల నుంచి జుట్టు అమాంతం పెరిగి ప్రస్తుతం 3 మీటర్ల పొడవుకు చేరుకుంది. ఆమె జడ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 81 ఏళ్ల వయస్సులో అంత పెద్ద జుట్టును ఎలా భరిస్తున్నావంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఎక్కడికైనా బయటికి వెళ్లినప్పుడు
కొప్పు వేసుకుంటానంటోంది ఈ బామ్మ. తన జుట్టు చూసి చిన్న పిల్లలు భలే ముచ్చట పడతారని, వింత ప్రశ్నాలు అడుగుతారని చెబుతోంది. తలస్నానం చేయడానికి ఒక గంట సమయం పడుతుందని, ఆరబెట్టడానికి రోజంతా సమయం పడుతుందని చెబుతోంది .