ఫేస్బుక్లో నిత్యం ఎన్నో ఫేక్ న్యూస్ షేర్ అవుతుంటాయి. అయితే వాటిని షేర్ చేస్తున్నవారు ఎక్కువగా 65 ఏళ్ళ పైబడినవారే వున్నారని ఓ అధ్యయనం తెలిపింది.
ఈ విషయాన్ని న్యూయార్క్ యూనివర్సిటీ, ప్రిన్స్టన్ యూనివర్సిటీ సంయుక్తంగా అధ్యయనం నిర్వహించి వెల్లడించారు. 3,500 అన్నీ వయసుల వారిపై అధ్యయనం చేయగా ఈ విషయం బయటపడినట్టు తెలిపారు. 2016లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో 2016కు ముందు తర్వాత వారి ప్రవర్తనను శాస్త్రవేత్తలు పరిశీలించారు. 45-65 ఏళ్ల మధ్యనున్న వారితో పోలిస్తే రెండింతలు ఎక్కువగా వీరు తప్పుడు సమాచారాన్ని షేర్ చేస్తున్నట్టు అధ్యయనం తెలిపింది.ఈ పరిశీలనలో 65 ఏళ్లు పైబడిన వృద్ధులు ఫేస్బుక్లో ఎక్కువగా ఫేక్‌న్యూస్‌ను షేర్ చేస్తున్నట్టు దృవీకరించారు. విద్యాసంబంధ విషయాలు, జాతి, సంపాదన, లైంగిక విషయాలను ఫేస్బుక్లో తప్పుగా ప్రచారం చేస్తున్నట్టు తమ అధ్యయనంలో వెల్లడైనట్టు తెలిపారు. వివిధ వయసులకు చెందినవారిలో 8.5 శాతం మంది ఫేస్బుక్ యూజర్లు తమ ప్రొఫైల్‌లో కనీసం ఒక్క తప్పుడు సమాచారాన్ని అయినా షేర్ చేస్తున్నారని వెల్లడించారు.Telugu news Older People Shared Fake News on Facebook More Than Others in 2016 Race, Study Says