సంధ్య, మహాటీవీపై కేసు పెడతా.. జీవిత - MicTv.in - Telugu News
mictv telugu

సంధ్య, మహాటీవీపై కేసు పెడతా.. జీవిత

April 17, 2018

మహిళా హక్కుల కార్యకర్త సంధ్య, మహా టీవీలు కలిసి తనపై అసత్య ప్రచారం చేశాయని నటి జీవితా రాజశేఖర్ మండిపడ్డారు. ఆమె మంగళవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ‘ నేను ఇండస్ట్రీకి వచ్చి 30 సంవత్సరాలు అవుతోంది. చాలా సినిమాల్లో నటించాను. రాజశేఖర్‌ను పెళ్లి చేసుకున్నాను. ఇద్దరు ఆడపిల్లలకు తల్లినయ్యాను. అలాంటి నేను నా భర్త పక్కలోకి అమీర్ పేట్‌లోని హాస్టల్ అమ్మాయిలను పంపిస్తున్నానని చెప్తారా ? ఏ ఆధారాలున్నాయి నా మీద ఇంత పెద్ద నింద వేశారు. సంధ్య గారు నాతో ఫోన్‌లో మాట్లాడినట్టు నేను, అమ్మాయిలను నా భర్త పక్కలోకి పంపిస్తున్నానని ఎలా అంటారు ? మహాటీవీ మీద, సంధ్యగారి మీద పోలీసులకు ఫిర్యాదు చేస్తాను..’ అని హెచ్చరించారు.‘రాజశేఖర్‌కు రోజుకో అమ్మాయి కావాలి.. అమ్మాయిల పిచ్చోడు.. అంటున్నారు? సాక్ష్యమేంటి? ఆయన్ని ఏ క్లబ్బులోనైనా చూశారు? అమ్మాయిలతో ఉండగా చూశారా?’ అని ప్రశ్నించారు.

సినిమా పరిశ్రమలో మంచితోపాటు చెడు కూడా ఉందని ఆమె అంగీకరించారు. అయితే అందరూ పడుకునే అవకాశాలు తెచ్చుకోలేదన్నారు. సినిమారంగంతో చాలా రంగాల్లో క్యాస్టింగ్ కౌచ్ ఉందన్నారు. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ నడుస్తుంటే మాకొచ్చి కంప్లైంట్ చెయ్యాల్సింది కానీ ఇలా శ్రీరెడ్డి రచ్చకెక్కాల్సింది కాదన్నారు. ‘ఒంటి మీద తెలివిగల అమ్మాయిలు కాస్టింగ్ డైరెక్టర్ల దగ్గర ఎలా పడుకుంటారు ? చిన్న పిల్లలు కారు కదా ? అర్హత లేని వాళ్ళకు సినిమాల్లో అవకాశాలు ఇవ్వం. ఇలా మా సినిమావాళ్ళ మీద లేనివి కల్పిస్తే ఊరుకోను. సినిమా ఇండస్ట్రీలో వున్న పెద్దవాళ్ళందరూ వచ్చి మాట్లాడాలి ’ అని మండిపడ్డారు. కానీ సినిమాల్లో తెలుగు అమ్మాయిలకు కనీస గౌరవం కూడా లేదని.. హీరోయిన్ పాత్ర కాదు భిక్షగత్తె పాత్రలు కూడా ఇవ్వటం లేదని శ్రీరెడ్డి వర్గం వాళ్ళు వాదిస్తున్నారు.