ఎంత ఘాటు ప్రేమయో.. సుస్మితా, ఐలవ్ యూ! - MicTv.in - Telugu News
mictv telugu

ఎంత ఘాటు ప్రేమయో.. సుస్మితా, ఐలవ్ యూ!

November 19, 2018

బాలీవుడ్ ముదురుభామ సుస్మితా సేన్ పీకలనిండా ప్రేమలో తేలియాడుతున్నారు. ఇంతవరకూ పెళ్లిగిళ్లీ బాదరబందీ వద్దనుకున్న ఆమె ఇప్పుడు ప్రేమే ప్రాణంగా బతికేస్తున్నారు. ప్రియుడు రోహ్మాన్ షాల్‌తో చూడముచ్చటగా కనిపిస్తున్నారు. ఇన్నాళ్లూ దాచుకున్న ప్రేమనంతా అతనిపై వర్షిస్తున్నారు.

ఈ రోజు 43వ ఏట ప్రవేశించిన సుస్మితకు 27 ఏళ్ల రోహ్మాన్ తాజాగా పబ్లిగ్గా లవ్ ప్రపోజ్ చేశాడు. ఆమెతో కలసి వేడుక జరుపుకుంటూ సుస్మితా ఐలవ్యూ అన్నాడు. ‘నా ప్రేయసికి జన్మదిన శుభాకాంక్షలు. ఇది నీ జీవితంలో ఎంతో ముఖ్యమైన రోజు. ఈ సంవత్సరం నీకు అద్భుతంగా ఉండాలని, నువ్వు సుమధుర అనుభూతులతో గడపాలని కోరుకుంటున్నా.. సుస్మితా సేన్‌ ఐ లవ్‌ యు. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తుంటాను’ అన్నాడు. సుస్మిత తన ఛాతీపై వాలివుండగా తీయించుకున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. దీంతో అది కాస్తా వైరలై నెటిజన్లను తెగ ఆకర్షిస్తోంది.

 

మోడల్ అయిన రోహ్మాన్‌తో తన అనుబంధాన్ని సుస్మిత ఏమాత్రం దాచి పెట్టడం లేదు. తామిద్దరం డేటింగులో ఉన్నామని, అయితే పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన ఇప్పటికైతే లేదని అంటోంది. ఇద్దరు అమ్మాయిలను దత్తత తీసుకున్న సుస్మిత.. రోహ్మాన్‌లో ఓ ఫ్యాషన్ షో చూసి మనసు పారేసుకున్నారు. అమె భావాలు అతనికీ నచ్చడంతో ప్రేమ ఫలించింది.

Telugu news  On Sushmita Sen’s birthday, Rohman Shawl confesses his love for his ‘jaan’ As Sushmita Sen celebrates her birthday today, rumored boyfriend Rohman Shawl shared a special message for her along with a picture on Instagram.