31న కొలువుల కొట్లాట జరిపి తీరతాం  - MicTv.in - Telugu News
mictv telugu

31న కొలువుల కొట్లాట జరిపి తీరతాం 

October 28, 2017

ఈ నెల 31 వ తేదీన కచ్చితంగా కొలువుల కొట్లాట సభ జరిపి తీరుతామని తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం స్పష్టం చేశారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ ‘సభకు అనుమతి ఇవ్వటంలో ప్రభుత్వం కాలాయాపన చేస్తోంది.

ఆంధ్ర పాల‌కుల కంటే దారుణంగా రాష్ట్ర‌ ప్ర‌భుత్వ పాల‌న సాగుతోంది. పోలీసులు కూడా సభ నిర్వహించకుండా అడ్డుకునే ఆలోచనలో వున్నారు.  సభకు ఫంక్షన్ హాళ్ళు, స్థలాలు ఇవ్వొద్దని రౌడీల్లా యజమానులను బెదిరిస్తున్నారు. ఆంధ్రా పాలకుల కంటే చాలా దుర్మార్గంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోంది’ కోదండరాం పేర్కొన్నారు. సరూర్ నగర్ స్టేడియంలో అనుమతివ్వకపోతే ఎన్టీయార్ స్టేడియంలో సభ నిర్వహిస్తామన్నారు. ఈ సభలో ప్రత్యేకంగా కోదండరాం కొలువుల జాతరంటూ నిరుద్యోగ యువతను ప్రభుత్వం ఎలా నమ్మించి మోసం చేస్తున్నదో వివరించనున్నారు.