mictv telugu

ప్రేమికుల రోజు కట్టుదిట్టం.. పార్కులపై షీటీమ్స్ నిఘా

February 14, 2019

ఈరోజు ప్రేమికుల దినోత్సవం. ప్రేమికులు పార్కులు, సినిమాలు, షికార్లకు వెళ్తారు. అయితే ఇది మన సంస్కృతి కాదని, జంటగా కన్పించేవారికి పెళ్లిళ్లు, వారి తల్లిదండ్రులతో కౌన్సెలింగ్ ఇప్పిస్తామని కొన్ని సంఘాల నిర్వాహకులు చెబుతున్నారు. ఈ క్రమంలో షీటీమ్స్ బృందాలు అప్రమత్తమయ్యాయి. ఓవైపు యువతీ యువకులు కలిసి తిరిగే అవకాశం ఉండటం.. మరోవైపు కొన్ని సంఘాల నిర్వాహకులు మోహరించనున్న నేపథ్యంలో షీ టీమ్స్ ఈ నిర్ణయం తీసుకున్నారు.  గతంలో ప్రేమికుల దినోత్సవం నేపథ్యంలో కొన్ని పార్కుల్ని సంఘాలు మూసేశాయి. ఆరోజు కలిసి తిరిగిన జంటలకు పెళ్లిళ్లు చేయాలని చూశారు. అలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా వుండాలని షీటీమ్స్ యువత ఎక్కువగా సంచరించే ప్రదేశాల్లో షీ బృందాలు పర్యవేక్షించనున్నాయి.

Telugu news On Valentine s Day security Strict. She teams surveillance on parks and multiplexes..

జంటలను ఎవరైనా బెదిరించేందుకు ప్రయత్నిస్తే అడ్డుకుంటామని హైదరాబాద్‌ షీ బృందం బాధ్యురాలు సి.నర్మద వెల్లడించారు.  ఈ నేపథ్యంలో యువతీ యువకుల కదలికలపై తల్లిదండ్రులు కూడా ఓ కన్నేయాలని పోలీసులు చెబుతున్నారు. పబ్లిక్‌ గార్డెన్‌, ఇందిరాపార్క్‌, బిర్లా టెంపుల్‌, నెక్లెస్‌ రోడ్డు, పీపుల్స్‌ ప్లాజా, మల్టీప్లెక్స్‌లు వంటి  తదితర ప్రాంతాల్లో నిఘాకై సిద్ధమయ్యారు. షీ బృందాలు ఆయా ప్రాంతాల్లో సంచరిస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. బుధ, గురువారాల్లో రాత్రి సమయంలో కొన్ని ప్రత్యేక ప్రాంతాలతో పాటు ఐస్‌క్రీమ్‌ పార్లర్లు, పబ్‌లు, రెస్టారెంట్ల వద్ద నిఘా ఉంచనున్నారు. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌ లాంటి ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా ఉండటంతో ఆయా చోట్ల గస్తీ పెంచామని పోలీస్‌ ఉన్నతాధికారులు పేర్కొన్నారు.Telugu news On Valentine s Day security Strict. She teams surveillance on parks and multiplexes