mictv telugu

ఇండియాలో ఒకే ఫ్యామిలీ…ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ తెలుగు ట్రైలర్

January 10, 2019

‘మహాభారతంలో రెండు ఫ్యామిలీస్ వున్నాయి కానీ ఇండియాలో ఒక్కటే..’ అన్న డైలాగుతో  వచ్చింది ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ సినిమా తెలుగు ట్రైలర్. అణు ఒప్పందం, కాశ్మీర్ సమస్య వంటి పరిణామాల మధ్య మన్మోహన్ సింగ్ భారత్‌కు ప్రధానిగా కొనసాగిన తీరును ఈ సినిమాలో ప్రధానంగా చూపిస్తున్నారు దర్శకుడు విజయ్ రత్నాకర్ గుట్టె. ఆర్థికవేత్త నుంచి రాజకీయనాయకుడిగా మారి 2004 నుంచి 2014 వరకు యూపీఏ పక్షాన ప్రధానిగా పనిచేసిన మన్మోహన్‌ సింగ్ జీవిత నేప‌థ్యంలో ఈ చిత్రం తెర‌కెక్కిన‌ సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల ఈ చిత్రం చుట్టు అనేక వివాదాల‌ు ముసురుకున్నాయి.

ప్రపంచ వ్యాప్తంగా 12 భాషల్లో జ‌న‌వ‌రి 18న చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు. మన్మోహన్‌ సింగ్‌ పాత్రలో ప్రముఖ నటుడు అనుపమ్‌ ఖేర్‌ నటించ‌గా.. సోనియా గాంధీగా సజ్జన్‌ బెర్నార్ట్‌ కనిపించనున్నారు. రాహుల్ గాంధీగా అర్జున్ మాథూర్, ప్రియాంక గాంధీగా ఆహానా కుమ్రా నటించారు. మన్మోహన్ సింగ్‌కు మీడియా సలహాదారుగా వ్యవహరించిన సంజయ్ బారు రాసిన ‘ది యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌ : ది మేకింగ్‌ అండ్‌ అన్‌మేకింగ్‌ ఆఫ్‌ మన్మోహన్‌సింగ్‌’ పుస్తకం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.