999కే  ఏడాదిపాటు రోజూ 1జీబీ.. బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్ - MicTv.in - Telugu News
mictv telugu

999కే  ఏడాదిపాటు రోజూ 1జీబీ.. బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్

February 15, 2018

బీఎస్ఎన్ఎల్ వినియోగదారులను ఆకర్షించటానికి ఓ సంచలనాత్మక నిర్ణయాన్ని తీసుకుంది. ‘ మ్యాగ్జిమమ్ ’ పేరిట సరికొత్త బంపర్ ఆఫర్ ప్లాన్‌ను తెస్తున్నట్టు బీఎస్ఎన్ఎల్ తెలిపింది.  రూ. 999 లతో రీచార్జ్‌తో ఏడాది పాటు ( 365 రోజులు ) రోజుకు 1 జీబీ డాటాను వాడుకోవచ్చని తెలిపింది.  అలాగే 6 నెలల పాటు అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్ కూడా అందుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు ఒక ట్వీట్ చేస్తూ, అసొం సహా ఉత్తర భారతావనితో పాటు జమ్మూ కాశ్మీర్‌కు ఈ ప్లాన్ వర్తించదని స్పష్టం చేసింది.భారత టెలికం రంగంలోకి జియో ప్రవేశించిన తరువాత ఆపరేటర్లు మధ్య పోటీ ఏర్పడింది. ఈ క్రమంలో కొన్ని నెట్‌వర్క్‌లు తన సేవలను నిలుపుకోగా, కొన్ని పోటాపోటీగా రకరకాల ఆఫర్లతో వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నం చేశాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్ ఈ మ్యాగ్జిమమ్ ఆఫర్‌తో ముందుకొచ్చింది. బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు ఇది శుభవార్త అనే చెప్పొచ్చు.