అరుదైన అవార్డును అందుకున్న శివగామి - MicTv.in - Telugu News
mictv telugu

అరుదైన అవార్డును అందుకున్న శివగామి

December 1, 2017

భారతీయ సినిమా చరిత్రలో ‘బాహుబలి’ సంచలనం అంతా ఇంతా కాదు. ఇప్పటికే పలు జాతీయ అవార్డులు అందుకున్న  ఈసినిమాకు మరో గౌరవం దక్కింది. సీఎన్ఎన్ ఐబీఎన్ ఇండియన్ ఆఫ్ ది ఇయర్ 2017 అవార్డుకు బాహుబలి ఎంపికైంది. గురువారం జరిగిన కార్యక్రమంలో ఈ చిత్రాన్ని ‘ఇండియన్ ఆఫ్ ది ఇయర్’ గా ప్రకటించారు. ఈసినిమాలో శివగామిగా అందరిని మెప్పించిన రమ్యకృష్ణకు , మరియు ‘బాహుబలి’  నిర్మాత యార్లగడ్డ శోభుకు  కేంద్రమంత్రి అరున్ జైట్లీ ఈఅవార్డును అందించారు. ఇదే అవార్డును 2015 దర్శకుడు రాజమౌళి అందుకున్నారు. ఈసందర్భంగా  రమ్యక్రిష్ణ మాట్లాడుతూ బాహుబలిలో శివగామి పాత్ర నాకు జీవితాంతం గుర్తుంటుందని, దర్శకుడు రాజమౌళికి ధన్యవాదాలు అంటూ ఆమె తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.