మార్చి 15 నుంచి ఒకపూట బడులు - MicTv.in - Telugu News
mictv telugu

మార్చి 15 నుంచి ఒకపూట బడులు

March 6, 2018

ఎండాకాలం మొదలయింది. అప్పుడే ఎండలు మండిపోతున్నాయి. ఈ క్రమంలో స్కూలుకెళ్ళే పిల్లలకు రాష్ట్రంలో మార్చి 15 నుంచి ఒకపూట బడులను నడుపాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. త్వరలోనే జిల్లా విద్యాధికారులకు ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేయనున్నారు. మార్చి 15 నుంచి ఎస్సెస్సీ పరీక్షలు కూడా ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.అలాగే రాష్ట్రంలోని హైస్కూళ్ళల్లో చదివే విద్యార్థినులకు ఉచితంగా సైకిళ్ళను పంపిణీ చేసేందుకు విద్యాశాఖ ప్రయత్నిస్తోంది. గ్రామాల్లోని విద్యార్థినులు టౌన్ ఏరియాల్లో చదుకునేందుకు కాలి నడకన వెళ్ళాల్సి వస్తున్న క్రమంలో వారికి సైకిళ్ళను అందించాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకు సంబంధించి విద్యాశాఖ అధికారులు కేంద్రానికి ప్రతిపాదనలు పంపాలని భావిస్తోంది.