మమల్ని ఓడించేవారు ఇంకా పుట్టలేదు.. ఉద్దవ్ ఠాక్రే

 శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రే అమిత్ షా, బీజేపీ పార్టీపై పలు విమర్శలు గుప్పించారు. శివసేన పార్టీని ఓడించేవారు ఇంకా పుట్టలేదని, కొన్ని రోజుల క్రితం భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఓ సమావేశంలో మాట్లాడారు. తమ కూటమిలో ఉండే మిత్రపక్షాలను గెలిపిస్తామని, లేదంటే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తమతో కలిసిరాని పాత మిత్రపక్షాలు పూర్తిగా ఓడిపోయేలా చేస్తామన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని వర్లీలో నిర్వహించిన ఓ ర్యాలీలో ఉద్ధవ్‌ ఠాక్రే మాట్లాడుతూ… ‘మమ్మల్ని పూర్తిగా ఓడిపోయేలా చేస్తామని ఒకరు అన్నారు. మమ్మల్ని ఓడించేవారు ఇంకా పుట్టలేదు. మా ప్రయాణంలో ఎన్నో గొప్ప విజయాలను అందుకున్నాం’ అని అమిత్ షా పై పరోక్ష విమర్శలు చేశారు.

Telugu News One who will trounce Sena yet to be born .

అగ్రవర్ణ పేదలకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్‌ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. ‘ఆర్థికంగా వెనకబడిన వారికి మీరు నిజంగా సాయం చేయాలని భావిస్తే.. ఏడాదికి రూ.8 లక్షల లోపు ఆదాయం ఉన్నవారిని పన్నుల పరిధి నుంచి ఎందుకు తప్పించరు? ఒకవేళ కనీసం ఈ 10 శాతం రిజర్వేషన్లనైనా అమలు చేయకపోతే ఇది మరో తప్పుడు హామీగా మారిపోతుంది. మరోవైపు, మరాఠా రిజర్వేషన్ల అంశం ఇప్పటికీ కోర్టులోనే ఉంది. మరి దీనిగురించి ఏం చెబుతారు? ఓ వర్గానికి రిజర్వేషన్లు ఇచ్చామని చెప్పుకుంటున్నారు. మరి ఇతర వర్గాల పరిస్థితి ఏంటీ?’ అని ఉద్ధవ్‌ ఠాక్రే విమర్శించారు. భాజపాపై ప్రజలు విశ్వాసాన్ని కోల్పోతే, ఇక ఆ పార్టీని గద్దె దించుతారని విమర్శించారు. 2014లో ఇచ్చిన హామీలను భాజపా నెరవేర్చలేదని ఆరోపించారు.

Telugu News One who will trounce Sena yet to be born: Uddhav Thackeray