వన్‌ప్లస్ 6టీ ఫోన్.. గిన్నిస్ రికార్డు..   

ఎంతో ఇష్టంతో కొనుకున్న ఫోన్‌ను ఓపెన్ చేసేటప్పుడు కిక్కె వేరప్ప. అలా ఒక్కరే కాకుండా ఒకేరకమైన ఫోన్‌ను ఒకేసారి 559 మంది ఒపెన్ చేస్తే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది. ఊహించుకోవడానికే ఎంతో ముచ్చటగా ఉందికదా. అందుకేనేమో గిన్నిస్ బుక్ అధికారులు దీన్ని  రికార్డే అంటున్నారు. ఈ ఘనత సాధించింది ఎవరో కాదు వన్‌ప్లస్ 6టీ ఫోన్. తక్కువ సమయంలోనే బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్‌గా వన్‌ప్లస్ రికార్డులు సృష్టించన విషయం తెలిసిందే..

గురువారం ఇండియాలో వన్‌ప్లస్ 6టీ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. మొదట ఆన్‌లైన్ దిగ్గజాలు అమెజాన్, వన్ ప్లస్ ఇండియా స్టోర్స్‌లో అందుబాటులో ఉన్నాయి. అలాగే  నవంబర్ 3 తేదీ నుంచి రిలయన్స్ డిజిటల్ సహా వన్ప్లస్ ఆఫ్లైన్ స్టోర్లుక్రోమా స్టోర్స్లోనూ వన్ప్లస్ 6టీ లభించనున్నాయి. అయితే లాంచ్ అయిన మరుసటి రోజే వనప్లస్ 6టీ రికార్డు సాధించింది. అమెజాన్లో వనప్లస్ 6టీ స్మార్ట్ఫోన్ని ఆర్డర్  చేసిన వందలాది మంది వన్ప్లస్ కమ్యూనిటీ మెంబర్స్ని ముంబైలోని రిచర్డ్సన్ అండ్ క్రుడ్డాస్‌’కు రావాల్సిందిగా వన్ప్లస్ అధికారులు కోరడంతో 559 మంది అక్కడకు చేరకున్నారు.

వీరందరికి ఒకేసారి.. ఒకే వేదిక మీద వనప్లస్ 6టీ ఫోన్ని డెలివరీ చేసింది అమెజాన్. ఫోన్ను అందుకున్న వారందరూ ఒకేసారి దాన్ని అన్బాక్స్ చేశారు. ఇంతవరకూ ప్రపంచంలో ఇంత మంది ఒకే వేదికపై ఇలా ఒకే మోడల్ ఫోన్ని అన్బాక్స్ చేయలేదు. దీంతో ఘనత సాధించిన తొలి మొబైల్గా వన్ప్లస్ 6టీ రికార్డ్ సృష్టించి.. గిన్నిస్ వరల్డ్ రికార్డులోకెక్కింది.

వన్ప్లస్ అధికారులు మట్లాడుతూ వన్ప్లస్ కమ్యూనిటీ శక్తిని, ఉత్సాహాన్ని చూసి మేం ఆశ్యర్యానికి గురయ్యాం. వన్ప్లస్కు ఇండియాలో ఎంత పాపులారిటీ ఉందో వీరిని చూస్తే అర్థం అవుతోంది అని పేర్కొన్నారు.

OnePlus 6T was simultaneously unboxed by over 500 people at an event in Mumbai creates Guinness World Record